Thursday, September 4, 2008

ఈ తెలుగులో టెక్కులేమిటి ?

నమస్కారం. నా పేరు వేణుగోపాల్
బ్లాగ్ టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా!

TeX అనే ఒక కంప్యూటర్ సాఫ్ట్ వేర్ ఉంది. ఈ బ్లాగ్ లో ఎక్కువగా దాని గురించి ఉంటుంది.

నేను ఒక TeX అధ్యాపకుడిని కూడా! అంటే ఈ ప్రోగ్రామ్ ని నేర్చుకోవాలనే వారికి నేర్పుతో ఉంటా. చాలా తక్కువ మంది తెలుగు వారికి ఈ సాఫ్ట్ వేర్ గురించి తెలుసు. దీని గురించి ఎక్కువ మందికి తెలియజేయడమే నా ఉద్దేశ్యం.

టెక్ చరితం

అమెరికాలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ డోనాల్డ్ నూత్ అనే గణితాచార్యులు ఉన్నారు. ఆయన చాలా పుస్తకాలు, కంప్యూటర్ ప్రోగ్రామ్‍ల గురించి మరియు గణితానికి సంబంధించినవి, రాసారు. అలాంటి ఒక పుస్తకమే The Art of Computer Programming. ఇది చాలా ప్రసిద్ధి చెందిన పుస్తకం. దీని మొదటి ముద్రణ పుస్తకాలు అయిపోగా, ద్వితీయ ముద్రణసమయానికి కంప్యూటర్ విజ్ఞానంలో వచ్చిన మార్పుల వల్ల పుస్తకంలో చాలా మార్పులు చేసి ముద్రించ వలసిన అవసరం వచ్చింది.



దీన్ని మరియు నేను తయారు చేసిన తెలుగు ఫాంటు గురించి త్వరలోనే ఈ బ్లాగ్ లో చేరుస్తాను.