Tuesday, September 16, 2008

మహాలయ తర్పణవిధి

తర్పణవిధి
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః
ఓం ప్రద్యుమ్నాయ నమః
ఓం సంకర్షణాయ నమః
ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం అధోక్షజాయ నమః
ఓం నారసింహాయ నమః
ఓం అచ్యుతాయ నమః
ఓం జనార్దనాయ నమః
ఓం ఉపేంద్రాయ నమః
ఓం హరయే నమః
శ్రీ కృష్ణాయ నమః

పవిత్రం ధృత్వా (ఈ క్రింది మంత్రము చెప్పుచూ పవిత్రమును ధరించ వలెను)

పవిత్రవంతః పరివాజ మాసతే . పితైషాం పుత్రో అభిరక్షతి వ్రతం మహస్సముద్రం వరుణస్తిరోదధే . ధీరా ఇచ్చేకుర్దరుణేష్వారభం. పవిత్రం తేవితతం బ్రహ్మణ స్పతే. ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః. అతప్త తనూర్నతదామో అశ్నుతే శృతాస ఇద్వహం తస్తత్సమాసతే

ఉత్తిష్ఠన్తు భూత పిశాచాః ఏతే భూమి భారకాః
ఏతేషా మవరోధేన బ్రహ్మకర్మ సమారభే

ఓం భూః ఓం భువః ఓగ్ం సువః , ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం, భర్గో దేవస్య దీమహి. ధియోయోనః ప్రచోదయాత్ ఓమాపాజ్యోతీ రసో 2మృతం బ్రహ్మభూర్బువస్సువరోమ్

సంకల్పము : శ్రీగోవింద గోవింద గోవింద శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తస్య ఆద్య బ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేర్యోః దక్షిణ దిగ్భాగే ...
....
సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ..... నామ సంవత్సరే

మహాలయ అమావాస్యకు -
దక్షిణాయనే, వర్షఋతే, భాద్రపదమాసే, కృష్ణ పక్షే, ్అమావాస్యా తిథౌ .... వాసర యుక్తాయాం, శ్రీవిష్ణు నక్షత్ర, శ్రీ విష్ణుయోగ, శ్రీవిష్ణు కరణ, ఏవం గుణ విశేషణ విశిష్టాయం పుణ్య తిథౌ ..... గోత్రః, .... శర్మా నామధేయః (ప్రాచీనావీతి - యజ్ఞోపవీతమును అపసవ్యముగా చేసుకుని) ్అస్మత్పిత్రూనుద్దిశ్య, అస్మత్పతృ ప్రీత్యర్ధం, పిత్రాదీనాం అక్షయ పుణ్యలోక నివాస సిద్దర్ధ్యం మహాలయ పక్షే, కాన్యగతే, సవితరి ఆషాఢాది పంచ అపర పక్ష మధ్యే సకృన్మహాలయా పర ప్రయుక్త శ్రాద్ధ ప్రతినిధి సద్యస్తిల తర్పణం కరిష్యే

మకర సంక్రమణమునకు ... (దీనిని తరువాత చేరుస్తాను)
....

(యజ్ఞోపవీతమును సవ్యము చేసుసుని, జలముతోకూడిన కలశమును తాకి, తిరిగి అపసవ్యము చేసుకొనవలయును)
దక్షిణాభిముఖో భూత్వా (దక్షిణ దిశగా కూర్చొన వలెను) (దర్భ స్తంభమును (అది కూడా 3 దర్భపోచలతో కట్టినదే) పళ్ళెము నందుంచి, తిలసహిత దర్భ తీసుకొని, పిత్రాదులను దర్భస్తంభములోనికి, ఈ క్రింది విధముగా ఆవాహనము చేయవలెను).
ఉశన్త స్వాహవామహ, ఉశన్తస్సమి ధీమహి . అశన్నుశత వహ పిత్రూన్ హవిషే అత్తవే (ఈ మంత్రమును ఉచ్చరించి, తిల సహిత దర్భలతే ఆవాహన చేయవలెను) అస్మత్ పితృ, పతామహ, ప్రపితామహాన్ మాతృః ప్రపితామహాన్, సపత్నీకాన్ సర్వే కారుణ్య పిత్రూన్, తత్తత్ గోత్రాన్, తత్తత్ శర్మణః వసురుద్రాదిత్య రూపాన్ అస్మిన్ దర్భ స్తంభే ఆవాహయామి

(అని చెప్పి తిల సహిత జలమును దర్భస్తంభముపై ఉంచవలెను)
(నువ్వులు కొన్ని పంచపాత్రలో పోసుకొని, నువ్వులతే ఉద్ధరిణలోనికి నీరు ఎడమచేతిలో తీసుకొనవలెను. తిలసహిత జలమును గ్రహించి స్వధానమః తర్పయామి అని చెప్పుచూ మూడు మార్లు ప్రతి ఒక్కరికి తర్పణమును కుడిచేతి బొటనవ్రేలు, చూపుడ వ్రేలు మధ్యనుండి విడువ వలెను.)


ఆదౌ పితా తథా మాతా సపత్నీ మాతరస్తధా
మాతా మహస్సపత్నీకః ఆత్మ పత్న్యస్త్వనన్తరమ్
సుతభ్రాతృ పితృవ్యాశ్చ మాతులా స్సహ భార్యకాః
దుహితా భగినీచైవ దౌహిత్రో భాగినేయకః
పితృష్యసా మాతృష్యసా జామాతా భావుకః స్నుషా
శ్వశురః స్యాలకశ్చైవ స్వామినోగురు రర్ధినః


అను శ్లోకము ప్రకారము గోత్ర నామములతో సహా

అస్మత్
పితరం .... గోత్రం ......... శర్మాణం .... వసురూపం స్వధానస్తర్పయామి (3 సార్లు)
పితామహం ... రుద్రరూపం
ప్రపితామహం ... ఆదిత్యరూపం
మాతరం ... వసురూపం
పితామహీం రుద్రరూపం
ప్రపితామహీం ఆదిత్యరూపం
సపత్నీమాతం (సవతితల్లి) వసురూపం
మాతామహం వసురూపం
మాతుః పితామహం రుద్రరూపం
మాతుః ప్రపితామహం ఆదిత్యరూపం
మాతామహీం వసురూపం
మాతుః పితామహీం రుద్రరూపం
మాతుః ప్రపితామహీం ఆదిత్యరూపం

ఆత్మ పత్నీం (భార్య) వసురూపం
సుతం (కుమారుడు) రుద్రరూపం
భ్రాతరం (సోదరుడు) ఆదిత్యరూపం
పితృవ్యం (తండ్రి సోదరుడు) వసురూపం
మాతులం (తల్లి సోదరుడు) రుద్రరూపం
దుహితం (కూతురి) వసురూపం
భగినీం (సోదరి) వసురూపం
దౌహిత్రం (కూతురి కొడుకు)
భాగినేయకం (మేనల్లుడు)
పితృభగినీం (తండ్రి సోదరి)
మాతృభగినీం (తల్లి సోదరి)
జామాతరం (అల్లుడు)
భావుకం (బావ, బావమరిది)
స్నుషాం (కోడలు)
శ్వశురం (భార్య తండ్రి)
శ్వశ్రూం (అత్తగారు)
స్యాలకం (భార్య అన్న, తమ్ముడు)
స్వామి సఖ్యా చార్యాదీన్ తత్తద్గోత్రాన్ తత్తచ్ఛర్మణః వసురూపాన్ స్వధానస్తర్పయామి, తర్పయామి, తర్పయామి

(14 – 30 వరకు పెద్దవారికి జ్యేష్ఠ అనియు, తరువాత వారికి తదనంతర జ్యేష్ఠ అనియు, చిన్నవారికి కనిష్ఠ అనియు చెప్పుకొనవలయును)
యేకే చాస్మత్కులే జాతాః అపుత్రా గోత్రజామృతాః
తే గృహ్ణంతు మయాదత్తం సూత్రనిష్పీడనోదకమ్
కృష్ణ, కృష్ణ, కృష్ణ
(అనుచు తడిపిన జందెపు నీళ్ళతే తర్పణం వదలవలెను. యజ్ఞోపవీతము యొక్క బ్రహ్మముళ్ళను తడిపి కళ్ళకద్దుకొనవలెను)
(పవిత్రమునకును, దర్భస్తంభమునకును గల ముళ్ళను విప్పి, వాటిని తర్పణము చేయబడిన నీటిని త్రొక్కని స్థలమున వేయవలెను. కాళ్ళు కడుగుకొని ఆచమనము చేయవలెను. కళ్ళు తుడుచుకొనవలయును)
***

1 comment:

Unknown said...

D. Venu Gopal గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.