చాలా రోజులనుంచి నాకు తెలుగు భాషకు ఏదో సేవ చేసెయ్యాలన్న కండూతి.
ఆంధ్రాలో ఉన్నవాళ్ళకు బోలెడు తెలుగు ఫాంట్లు దొరుకుతాయి. కొన్ని అప్పనంగా (free) గా కూడా దొరుకుతాయి. అదీకాక చాలామంది తెలుగు టైపు పరీక్షలు పాసయి ఉంటారేమో వాళ్లకు ఆ కీ బోర్డుకు సరిపడ ఫాంటు దొరికితే చాలు. సర్దుకు పోతారు. మనపరిస్థితి అదికాదే. ఫాంట్లు దొరకవు, తెలుగు టైపురాదు.
సరే నండి. ముందుగా నేను C-DAC,పూనా వారి DOS ఆధారిత కంప్యూటర్ ప్రోగ్రామ్ ను PC Quest మేగజైనులో చూసాను. లోడు చేసాను. నచ్చింది కాని కిటికీలలోకి మల్లా రకరకాల అక్షరాలు రావే! అదీ కాక మనకి WordStar రకం ప్రోగ్రామ్ లు అంటే ఎలర్జీ.
తరువాత 1997 లో అనుకుంటా 2500 పెట్టి C-DAC వారి iLeap కొన్నాను. ఊరందరిదీ ఒకదారి, ఉలవగట్టుదోదారీట. అదీ పరిస్తితి. మనం WordPerfect లో పనిచేస్తాం. అది చెయ్యనంటుంది. ముందు లీప్ లో టైపుచేసాక దాన్ని వర్డు లో కాని వర్డుపెర్ఫెక్టు లో కానీ అతికించుకోవాలి. కానీ కరెక్టుచేసుకోడానికిలేదే. చాలా విచిత్రమైన పరిస్తితి.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment