Wednesday, December 24, 2014

TeX ప్రోగ్రామును దింపకోలు చేసుకోవడం మరియు సిస్టం లో స్థాపించుకోవడం

టెక్ ఉచిత కంప్యూటరు సాఫ్ట్ వేరు. దీనిని జాలం నుండి దింపుకోలు చేసుకోవచ్చు లేదా మీకు దీని డివిడి ఎవరి వద్దనైనా దొరికితే తీసుకుని మీ సిస్టంలో స్థాపించుకోవచ్చు.

ప్రపంచంలో ఉన్న టెక్ యూజర్స్ అందరూ కలిసి టెక్ యూజర్ గ్రూపుగా ఏర్పడ్డారు. వీరి వెబ్ సైటు www.tug.org. లాటెక్ ప్యాకేజీలు క్రొత్తగా వచ్చినవి, పాతవి అప్ డేట్ అయినవి, గ్రూపు కాన్ఫరెన్సుల సమాచారం ఇక్కడ దొరుకుతుంది. అలాగే వీరు TUG Boat అనే పత్రికను కూడా నడుపుతున్నారు.

www.tug.org వెబ్ పేజి లో మీరు TexLive  లేదా ProTeXt అన్న దాని మీద క్లిక్ చేసిన సంబంధిత పేజి తెరచుకొనును. టెక్ ప్రోగ్రాము విండోస్, లైనక్సు, యూనిక్స్ మరియు ఆపిల్ మొదలగు అన్ని రకములు కంప్యూర్ ఆపరేటింగ్ సిస్టమ్ ల మీద పనిచేయును. మీరు లైనక్సును వాడుచున్నట్లయిన టెక్ లైవ్ ను దింపుకోలు చేసుకోండి. విండోస్ వాడుతున్నవారు ప్రోటెక్స్ట్ లేదా టెక్ లైవ్ దేనినైనా వాడవచ్చు. ProTeXt  యొక్క మాతృక MikTeX. TeXLive iso ఇమేజ్ గా లభించగా ProTeXt self exploding zip ఫైలు గా లభిస్తుంది. ProTeXt.exe ఫైలును దించుకున్నాక డబల్ క్లిక్ చేయండి. Unzip చేయు డైరక్టరీని ProTeXt అన్న పేరుతో తయారు చేసి అందులో దానిని అన్ జిప్ చేయండి.

చాలా వరకు టెక్ కు సంబంధించిన ఫైళ్లు 1 కేబి సైజుకు మించి ఉండవు. అందువల్ల మీరు ProTeXt ను ఇన్స్టాల్ చేయుటకు ముందు మీ కంప్యూటర్ ను డిఫ్రాగ్ చేయండి.

ఇప్పుడు మీరు setup.exe ని డబల్ క్లిక్ చేయండి. ఆకృతి \ref{Protext} లో చూపిన విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది.  ఇంతకు ముందు కనక మీ సిస్టమ్ లో MikTeX ఇన్స్టాల్ చెసి ఉన్నట్లయిన ముందు దానిని అన్ ఇన్స్టాల్ చెయ్యండి. అలాగే C: డ్రైవులో ProgramFiles ఫోల్డరు లోకి వెళ్ళి MikTeX2.9 అన్న ఫోల్డర్ ను డిలీట్ చేయండి.
MikTeX ను ఇన్స్టాల్ చేయుటకు MikTeX ఎదురుగా ఉన్న Install బటన్ ను క్లిక్ చెయ్యండి. తరువాత వచ్చిన అన్ని డైలాగ్ బాక్సులను OK చేసుకుంటూ వెళ్ళండి. పూర్తి MikTeX ఇన్స్టాల్ అవడానికి దాదాపుగా 30 నుండి 45 నిమిషాలు పడుతుంది. MikTeX  ఇన్స్టాలేషన్ పూర్తియిన తరువాత క్రిందనున్న TeXStudio  అన్న ప్రోగ్రామును కూడా ఇన్స్టాల్ చెయ్యండి. TeXStudio లాటెక్ సులభంగా ఉపయోగించడానికి పనికి వచ్చే GUI.

ఇప్పుడు మీరు లాటెక్ లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు.

మీ డెస్క్ టాప్ మీద ఆకృతి లో చూపిన విధంగా TeXStudio ఐకాన్ ఉంటుంది. దానిని డబల్ క్లిక్ చేయండి. TeXStudio ఓపెన్ అయిన తరువాత మెనూ లో File  పై క్లిక్ చేసి New పై క్లిక్ చేయండి లేదా Ctrl + N నొక్కండి. ఇప్పుడు క్రింద చూపిన విధంగా టైపు చెయ్యండి :

\documentclass{article}

\begin{document}
Hello World!
\end{document}


దీనిని మీరు ఒక కొత్త ఫోల్డర్ ను క్రియేట్ చేసి దానిలో సేవ్ చెయ్యండి. తరువాత మెను లో ఉన్న Tools లోనికి వెళ్ళి Build\&View అన్న దాన్ని క్లిక్ చెయ్యండి లేదా F1 బటన్ ను నొక్కండి. అన్నీ సరిగా ఉంటే మీ ఫైలు రన్ అయి ఆకృతి \ref{gui} లో చూపిన విధంగా పక్కన పిడియఫ్ పైలు కనపడుతుంది. క్రింద మెసేజెస్ లో process exited normally అని వస్తే అన్నీ సక్రమంగా ఉన్నట్లే. ఇక మీరు లేటెక్ నేర్చుకోడానికి తయారు గా ఉన్నారు.

ఒక వేళ process exited normally అని రాక ఏమన్నా error messages వస్తే అవి ఏమిటో గమనించండి. సాధారణంగా చాలామంది \documentclass అన్నది ఒక మాటగా వ్రాయకుండా \document class అని విడివిడిగా వ్రాస్తారు. ఒకోసారి \begin{document} ..\end{document} లలో కూడా తప్పు ఉండవచ్చు. కొంత మంది మీసాల బ్రాకెట్ల బదులు పెరాంథసిస్ టైపు చేస్తారు. ఇవి అన్నీ సరిగ్గా ఉంటే LaTeX execute అయ్యిందా లేదా అన్నది చూడండి.


ఇన్స్టాల్ చేసిన వెంటనే లాటెక్ ను రన్ చేసినప్పుడు రన్ కాక పోతే GUI ను కన్ఫిగర్ చేయవలసి ఉంటుంది. దీని కొరకు మీరు Option menu పై క్లిక్ చేయండి. అందులో Configure TeXstudio అన్నదానిపై  క్లిక్ చేయండి. దానిలో ఎడమప్రక్కన ఉన్న Commands అన్నదానిపై క్లిక్ చేయండి. ఆకృతి \ref{configure} లో చూపినట్లు వచ్చిన అన్నీ సరిగా ఉన్నట్లు. అట్లు కాక Unknown అని వచ్చిన LaTeX అన్నదానికి ఎదురుగా ఉన్న బటన్ ను క్లిక్ చేయండి (ఆ బటన్ మీదకు మీరు మౌస్ ను తీసుకు వెళ్ళినపుడు Select Program అని వస్తుంది) .


అపుడు C: డ్రైవ్ ఓపెన్ అవుతుంది. అందులో Program Files అనే ఫోల్డర్ ఉంటుంది దానిని క్లిక్ చేయండి (మీ సిస్టమ్ కనుక 64 బిట్ సిస్టమయిన Program Files (x86) అనే ఫోల్డర్ కూడా ఉంటుంది). అందులో మరల MikTeK2.9 అనే ఫోల్డర్ ఉంటుంది. దానిని ఓపెన్ చెయ్యండి. అందులో మరల miktex అనే ఫోల్డర్ ను తెరిచి తిరిగి అందులో ఉన్న Bin అన్న ఫోల్డర్ ను తెరవండి. టెక్ కు సంబంధించిన అన్న బైనరీ (exe) ఫైళ్లు ఈ ఫోల్డర్ లో ఉంటాయి. latex.exe అన్న ఫైలును వెతికి దానిని ఓపెన్ చేయండి. ఇలాగే మిగిలిన వాటికి కూడా (pdfLaTeX, XeLaTeX, DVI viewer) వాటికి సంబంధించిన బైనరీ ఫైలును ఓపెన్ చేసి చివరిగా OK చెయ్యండి.

ఇప్పుడు మీ లాటెక్ ఫైలు రన్ అవుతుంది.

అలాగే TeXStudio లోని మిగిలిన ఆప్షన్లను కూడా కన్ఫిగర్ చేసుకోవండి. మీరు F1 లేదా F6 తో రన్ చేసినప్పుడు latex రన్ అవ్వాలా లేక pdflatex రన్ అవ్వాలా లేక xelatex రన్ అవ్వాలా అన్నది మార్చుకోవడానికి Build అన్నదానిపై క్లిక్ చేసి మార్చుకోవచ్చు.

అలాగే మీకు కనక ఎడిటర్ లోని అక్షరాలు లేక మెనులోని అక్షరాలు చిన్నవిగా ఉన్నాయనిపిస్తే వాటిని కూడా పెద్దవి చేసుకోవచ్చు. దానికోసం Editor అన్నదానిపై క్లిక్ చేసి మీకు కావలసిన ఫాంటును, ఫాంటు సైజును ఎన్నుకోవండి. అలాగే డిక్ష్నరీలను కూడా సెట్ చేసుకోవండి. ఇందులో ఓపెన్ ఆఫీసువారి డిక్ష్నరీలు పనిచేస్తాయి. మీకు కావలసిన డిక్ష్నరీని డౌన్లోడ్ చేసుకొని పాత్ లో పెట్టుకోవండి.

ఈ విధంగా మీరు TeXStudio ను మీకు కావలసిన విధంగా కన్ఫిగర్ చేసుకోవచ్చు.

TeXStudio కాకుండా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కొరకు TeXnicCenter, WinEdit, WinShell, TeXMakerX మొదలయిన GUI లు కూడా ఉన్నాయి. లైనక్స్ లో Kile అనే GUI తో పాటు Vi, Emacs లను కూడా ఉపయోగించకోవచ్చు.

No comments: