రచన : కీ. శే. పిడపర్తి కామేశ్వర శాస్త్రి
వందనమ్ములు సరస్వతి నీకు గొనుమా । శరణుజొచ్చితిమ్మ శారదాదేవి ॥
వరములివ్వగదమ్మ భారతీ మాకు । పూజింతుము విరించి పూబోణి నిన్ను॥
కొలచెదము కళ్యాణి కోటి ప్రధాత్రి । భజియించెదము శరద్వారిత శుభాంగి ॥
కలహంస గమనరో కొలిచెదము మదిని । వితత నితంబినీ స్తుతియింతుమ్మా॥
మృగరాజమధ్యవని మేము పాడెదము । పరిపీన కుచకుంభ ప్రాంజనులమ్మ॥
రక్షించవమ్మ పల్లవ పాణి మమ్ము। కరుణించు కంభు కంఠీరహిమీర ॥
ప్రాహుడంబుజ కేశ పాశరావమ్మ । పక్వబింబోష్ఠి దర్పణ గండయుగళీ ॥
కవలయౌతను మధ్య ఘూరిణితానయన । పూర్ణిమా చందర స్ఫూర్జితానయన ॥
బాలసుధాంసు విభ్రాజిత కిరీటా । శుభ్రకౌశేయ భాసుర సుందరాంగి ॥
కాశ్మీర తిలక ప్రకాశిత లలాట । దరహాస చంద్రికా ధవళదిగ్భాగ ॥
అచ్ఛమౌక్తిక హార పిచ్ఛలగ్రీవా । మందీసుమదామ సుందరనితంబ ॥
మాణిక్య మంజీర మధురరవాంగి । ఓజగన్మోహిని ఓజగద్ధాత్రి ॥
ఓజగత్కల్యాణి ఓజగదంబ । ఓకచ్ఛపీవాదనైక పాండిత్యా ॥
ఓమధుర భాషిణి ఓగిరం దేవి । తరలి రావమ్మ మామొరలు వినవమ్మ ॥
చేయూత కెంగేల నీయవేమాకు ।శుద్ధ వాగ్జాలంబు సిద్ధింపజేసి ॥
వనరు వేధావంతులను మమ్ము జేసి । వినయ విజ్ఞానయుతల గావించి ॥
తల్లితండ్రులకుత్సాహ ముప్పొంగ । ఒజ్జల కష్ఠంబు లుపయోగమొంద ॥
ఇక జీవతంబు తేలికనొంద । తల్లిరో వాణి పర్థిల్ల చేయగదే ॥
ఇవియే పదివేల సౌస్థవంబులు నీకు జనని । జయ విజయీభవ దిగ్విజయీభవ ॥
సేకరణ : ఏలేశ్వరపు వెంకట సత్య సుబ్బలక్ష్మి
రచయిత పరిచయం :
కీ.శే. పిడపర్తి కామేశ్వర శాస్త్రి గారు ప్రసిద్ధ జ్యోతిష పండితులు కీ.శే. పిడపర్తి చిన పూర్ణయ్య గారి మనుమలు. వీరి తండ్రిగారు కీ.శే. కల్యాణ వీరభద్ర దీక్షితులు గారు చినపూర్ణయ్యగారి జ్యేష్ఠ కుమారులు. కామేశ్వర శాస్త్రి గారు చాలా రచనలు చేసినా వాటిని భద్రపరచనూ లేదు, ముద్రింపచెయ్యనూలేదు. ఈ సరస్వతీ వందనమును సూర్యారావుపాలెం (వయా దువ్వ) గ్రామస్తుల కోరికమీద దశరా ఉత్సవాలలో పాఠశాల విద్యార్ధులకు గిలకల పాటగా పాడుకోడానికి వ్రాసి ఇచ్చారు. దీనిని వారి చెల్లలయిన మా అమ్మగారు (కీ. శే. దువ్వూరి సీతమ్మ గారు) కంఠస్తంచేసి రోజూ పాడుకొనేవారు. ఈ పాట వ్రాసి సుమారు 75 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి.
Sunday, November 2, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
75 samvatsarala pata annamaata.
Post a Comment